Python Viral Video: వామ్మో ఇదేం పాము.. నది ఒడ్డున సన్‌బాత్‌ చేస్తుంది.. షాక్ కు గురి చేస్తున్న వీడియో

Updated on: Dec 10, 2021 | 5:21 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఒకింతి భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ అనకొండకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఒకింతి భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ అనకొండకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నమ్మడం కష్టమే.. ఎందుకంటే పాము ఆకారం, పొడవు అంత భారీగా ఉందిమరి. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు చూసి.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. వామ్మో.. ఈ పాము అక్కడేం చేస్తుంది.. అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో నది ఒడ్డున ఓ పెద్ద పాము హాయిగా సేదతీరుతుంది. నిశితంగా పరిశీలిస్తే పాము పొడవు భారీగానే ఉంది. సుమారు ఓ 100 అడుగులు ఉంటుంది. ఈ పామును చూస్తే నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటోందనిపిస్తోంది. అయితే.. ఈ పాములో ఎలాంటి రియాక్షన్‌ లేదు.. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ లోనే ఇలాంటి పాములు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇంత పెద్ద పాము అసలు భూమి మీద ఉందా..? అంటూ పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఎవరూ ధ్రువీకరించడం లేదు.. కానీ ఈ పెద్ద పామును చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పామును చూస్తే భయం వేస్తుందని.. అసలు పాము అక్కడ ఏం చేస్తుందోనంటూ కామెంట్లు చేస్తున్నారు.