ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
వేసవి తాపానికి పశుపక్ష్యాదులు జనావాసాల్లోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు ఆస్పత్రి వార్డులోకి నాగుపాము ప్రవేశించడంతో రోగులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను తరలించారు. స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వేసవి తాపానికి పశుపక్ష్యాదులు, వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లు, వాహనాలు, ఆస్పత్రులు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ఆస్పత్రిలో పేషంట్లను పరుగులు పెట్టించింది ఓ భారీ నాగుపాము. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం ఇన్ పేషంట్లు ఉన్న వార్డులోకి పాము ఒక్కసారిగా దూసుకు రావడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం వేళ సిబ్బంది వార్డును శుభ్రం చేస్తున్న సమయంలో, మూలలో దాగి ఉన్న పాము అకస్మాత్తుగా బయటకు రావడంతో రోగులు, ముఖ్యంగా చిన్నపిల్లలతో ఉన్న తల్లులు ప్రాణభయంతో బెడ్ల పై నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని, పాముకు ఎటువంటి హాని కలగకుండా పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!
వేసవిలో ‘సైలెంట్ కిల్లర్’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!
Chiyaan Vikram: యంగ్ లుక్ కోసం రిస్క్ చేసిన విక్రమ్
షాకింగ్! మసాజ్ కోసం.. ఏకంగా రూ.7.25 లక్షలు ఖర్చు చేసిన హీరోయిన్..
