Crime: సూసైడ్ బాంబర్ ఘాతుకానికి 52 మంది బలి.. ఎక్కడంటే..?
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఓ మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో కనీసం 52 మంది మరణించినట్లు పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు దగ్గర శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఓ మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో కనీసం 52 మంది మరణించినట్లు పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు దగ్గర శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
