SI Drink: ఏంటయ్యా ఇది నువ్వే ఇలా చేస్తే ఎలా.? తాగిన మత్తులో పక్కింటికి వెళ్లిన ఎస్సై.. అప్పుడే అసలు ట్విస్ట్.!

|

Dec 07, 2022 | 9:47 AM

ఫుల్‌గా మందేశాడు.. మత్తు కమ్మేసింది.. తడబడుతూనే ఇంటికి వెళ్లాడు. అయితే అయోమయంలో తన ఇంటికి కాకుండా పక్కింటికి వెళ్లాడు. దీంతో వారు ఇతడిని కుమ్మేశారు.


ఫుల్‌గా మందేశాడు.. మత్తు కమ్మేసింది.. తడబడుతూనే ఇంటికి వెళ్లాడు. అయితే అయోమయంలో తన ఇంటికి కాకుండా పక్కింటికి వెళ్లాడు. దీంతో వారు ఇతడిని కుమ్మేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాజాపూర్ మండల పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు శ్రీనివాస్‌. మద్యం మత్తులో ఆయన తన ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్లాడు. అయితే శ్రీనివాస్‌ సాధారణ దుస్తుల్లో ఉండటంతో దొంగ అనుకుని చితకబాది చెట్టుకు కట్టేశారు స్థానికులు. ఇదంతా జరిగాక ఆ వచ్చింది ఎస్సై అని తెలిసింది. దీంతో అతని వదిలివేశారు. మరి అంత సోయి లేకుండా తాగిన ఎస్సై తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. విషయం బయటకు రాకుండా వీడియోలు, ఫోటోలు తొలగించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..