Telangana: ‘మా ప్రిన్సిపల్‌తో వేగలేం…’ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థుల నిరసన

|

Aug 23, 2024 | 4:19 PM

పిల్లలు అదే పనిగా గొడవ చేస్తున్నా, చెప్పిన మాట వినకున్నా.. చెడు తిరుగుళ్లు తిరుగుతున్నా.. పేరెంట్స్ టీచర్లకు కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా టీచరు రాశి రంపాన పెడుతున్నదని ఏకంగా పోలీస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు పిల్లలు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

పోలీస్టేషన్ ముంగిట బైటాయించి మాకు న్యాయం చేయ్యాలని ధర్నా చేశారు పిల్లలు. ఆదిలాబాద్ జిల్లా,  జైనథ్ మండలం మహ్మత్మ జ్యోతిరావ్ పూలే హస్టల్‌లో చదువుకుంటున్న పిల్లలు.. ఆ హస్టల్ ప్రిన్సిపల్ సంగీత మేడం గారు రాశి రంపాన పెడుతుందని.. చెప్పకోలేని విధంగా భూతులు తిడుతుందని.. పోలీసులుకు కంప్లైంట్ చేశారు. ఆ టార్చర్ భరించలేక కొన్నిసార్లు హాస్టల్ వదలి పారిపోవాలి అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంక భరించడం తమవల్ల కాదని.. అందరూ కలిసి ఒక్కటే.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ తమ బాదను ఏకరువు పెట్టారు. వాళ్ల బాధలు సావధానంగా విన్న పోలీసులు న్యాయం చేస్తామని హామి ఇచ్చి పిల్లల్ని తిరిగి హాస్ట‌ల్‌కు పంపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..