భారతదేశంలో ప్రతిభకు కొదువలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని మరుగున ఉన్న ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లుకొడుతోంది. ఇద్దరు స్కూల్ విద్యార్ధులు రామాయణ, మహాభారతాన్ని కంటతా పట్టేసినట్టున్నారు.. ఏ ఫర్ యాపిల్ అనాల్సిన వయసులో ఇతిహాసాల్లోని ప్రశ్నలకు టకటకా సమాధానాలిచ్చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారుల ప్రతిభకు ఫిదా అయిపోతున్నారు. వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను ‘బ్యోమకేశ్’ అనే యూజర్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులను చాలా కష్టమైన ప్రశ్నలను అడిగాడు. వారిద్దరూ క్షణం కూడా టైమ్ తీసుకోకుండా సమాధానాలు చెప్పేశారు. అతడు మొదటి విద్యార్థిని పాండవ సోదరులు, ద్రోణాచార్య కుమారుడు, అర్జునుడి గురువు, మహాభారతానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇంకో విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడిగాడు. వారిద్దరూ వాటికి తడబడకుండా సమాధానం చెప్పారు. ఈ వీడియోను ప్రశ్నలు అడిగిన వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఇది స్కూల్ అంటే.. మీ పిల్లలను ఇక్కడే చేర్పించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ ఆ చిన్నారులను మెచ్చుకున్నారు. ఉత్తమ జ్ఞానాన్ని అందించినందుకు పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..