అతనికి 18.. ఆమెకి 50.. పూర్తి స్టోరీ తెలిస్తే షాక్‌ అవుతారు వీడియో

Updated on: Aug 09, 2025 | 2:46 PM

బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఒక వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల యువకుడు 50 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు ఇప్పటికే నలుగురు పిల్లలు, మనవరాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆమెను తన భార్యగా ఇంటికి తీసుకువచ్చాడు. గుజరాత్‌లో కూలీగా పనిచేస్తున్నప్పుడు అతనికి, జ్యోతి దేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

అది ప్రేమగా మారటంతో వారు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ, వారి మధ్య ఉన్న వయస్సు తేడా వల్ల వారి కుటుంబాలు పెళ్లికి ఆమోదం తెలపలేదు.భాగల్పూర్ జిల్లాలోని పక్కిసరై గ్రామానికి చెందిన 18 ఏళ్ల కన్నయ కుమార్ 50 ఏళ్ల మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి.. అక్కడ వార్తగా మారింది. కూలీ పని కోసం గుజరాత్ వెళ్లిన కన్నయ్య.. అక్కడి కహల్గావ్‌లోని శోభనాథ్‌పూర్ ప్రాంతానికి చెందిన జ్యోతి దేవిని కలిశాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జ్యోతి దేవికి భర్త హీరాలాల్ మండల్, ఆమె కుమారుడు అలోక్ తో బాటు మరో ముగ్గురు కూతుళ్లు మాత్రమే గాక కూతురి సంతానమైన మనుమలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అయినా.. జ్యోతి దేవి, కన్నయ్య పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమెను తీసుకుని యువకుడు తన స్వగ్రామానికి వచ్చాడు. వీరు మాయమైన తర్వాత.. సదరు మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు..తమ తల్లి తిరిగి ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. పోలీసుల విచారణలో జ్యోతి పెళ్లి చేసుకుందని తేలటంతో.. ఆమె కుటుంబ సభ్యులంతా కన్నయ్య ఊరికి చేరుకుని.. కన్నయ్య కుటుంబ సభ్యులను నిలదీశారు. గ్రామ పెద్దలు.. దీనిపై పంచాయతీ పెట్టారు. కానీ.. జ్యోతి మాత్రం కన్నయ్యతోనే బతుకుతానని తేల్చి చెప్పటంతో చేసేందేం లేక ఆమె కుటుంబ సభ్యులంతా నిరాశతో గుజరాత్ వచ్చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో

పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో