దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

Updated on: Jan 22, 2026 | 8:47 PM

మహబూబాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటిలో దొంగిలించబడిన 2.5 తులాల బంగారు నెక్లెస్, పోలీస్ ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగి ఇంటి ముందు ప్రత్యక్షమైంది. సాధారణంగా పోగొట్టుకున్న బంగారం దొరకడం అసాధ్యం అనుకుంటే, ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దొంగే తిరిగి బంగారం వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది.

బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్‌ రేటు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా రెండు రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.బయ్యారం మండలం సంతులాల్ పాడ్ గ్రామానికి చెందిన గోలి వెంకటేశ్వర్లు అనేవ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. రెండున్నర తులాల బంగారు నక్లెస్ ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఈ కుటుంబమంతా మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జనవరి 18వ తేదీ న ఆ ఇంట్లో చోరికి పాల్పడిన దొంగలు బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్లారు. ఊరినుంచి తిరిగివచ్చిన వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించాడు. ఇంట్లో బంగారు నెక్లెస్ కనిపించకపోవడంతో అవాక్కైనా కుటుంబ సభ్యులు తమ ఇంట్లో దొంగలు పడ్డారని భావించి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్న క్రమంలో 20వ తేదీన బంగారం ఇంటిముందు ప్రత్యక్షమైంది. ఆ నెక్లెస్ ను అపహరించిన వారు ఇంటిముందు వదిలేసి వెళ్లి పోయారు. ఇల్లు ఊడుస్తుండగా నెక్లెస్‌ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పోయిన బంగారం తిరిగి దొరకడంతో వెంకటేశ్వర్లు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.చోరీచేసిన బంగారాన్ని దొంగ తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు వదిలేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌ చలాన్ల బలవంతపు వసూళ్లకు చెక్‌.. హైకోర్ట్‌ కీలక ఆదేశాలు

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

Prabhas: ఇండియాలో నెంబర్ 1 స్టార్ మనోడే !!

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్