దొంగ కోళ్ల పంచాయతీ..ఏపీ పోలీసులు Vs తెలంగాణ పోలీసులు వీడియో
ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల చోరీ కేసులో పోలీసులు తెలంగాణలో హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి.
ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల చోరీ కేసులో పోలీసులు తెలంగాణలో హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి. నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ.. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు రంగనాథ్. 10 రోజుల తర్వాత బాధితుడే తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దమ్మపేటలో చోరీకి గురైన తన పందెం కోళ్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.చింతలపూడికి చెందిన పోలీసులు కోళ్ల కోసం దమ్మపేట వచ్చారు. నాలుగు కార్లలో నేరుగా శేషగిరి అనే వ్యక్తి ఇంట్లోకి ఏపీ పోలీసులు ప్రవేశించి అతని భార్యను బెదిరించి దొంగ కోళ్ల ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. అంతేకాదు ఇంటి గేట్లు మూసివేసి, సీసీ కెమెరాలు పగులగొట్టారు. హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. భర్త లేడని చెప్పినా వినకుండా ఏపీ పోలీసులు హల్ చల్ చేశారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
