AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

statue in pond: చెరువు తవ్వుతుండగా బయటపడింది.. భయంకరంగా అమ్మవారి విగ్రహం.. అందరూ షాక్..

statue in pond: చెరువు తవ్వుతుండగా బయటపడింది.. భయంకరంగా అమ్మవారి విగ్రహం.. అందరూ షాక్..

Anil kumar poka
|

Updated on: Aug 02, 2022 | 9:15 AM

Share

మిజోరాం డార్లాన్ గ్రామంలో అరుదైన ఘటన వెలగుచూసింది. గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో చెరువు తవ్వేందుకు స్థానికులు పూనుకున్నారు. అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.


మిజోరాం డార్లాన్ గ్రామంలో అరుదైన ఘటన వెలగుచూసింది. గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో చెరువు తవ్వేందుకు స్థానికులు పూనుకున్నారు. అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో 10 అడుగులు లోతు తవ్విన తర్వాత ఓ అరుదైన విగ్రహం బయటపడింది. దాన్ని చూడగానే స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విగ్రహం దేవతకు సంబంధించినదిగా తెలుస్తోంది.. ఏ దేవత అనేది మాత్రం అర్థం కావడం లేదు. విగ్రహంలో వీరత్వం ఉట్టిపడుతుంది. ఈ పురాతన విగ్రహం ఎవరిది అనేది అధికారికంగా గుర్తించలేదు. అయితే మిజోరాం గూర్ఖా మందిర్ కమిటీలోని హిందువులు ఇది కాళీ దేవికి చెందినదిగా చెబుతున్నారు. కొంతమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఈ విగ్రహం హిందూ మత దేవతకు చెందినదని భావిస్తున్నారు. ఈ విగ్రహం 3.6 అడుగుల పొడవు, 1.9 అడుగుల వెడల్పు ఉంది. దాదాపు రెండు క్వింటాళ్ల బరువు ఉంటుంది. ఇతర విగ్రహాలు ఏమైనా కనుగొనే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తవ్వకాల స్పీడు పెంచారు. అనాదిగా క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉండే మిజోరాం రాష్ట్రంలో హిందూ దేవతను పోలిన పురాతన విగ్రహం బయటపడటం స్థానికంగా చర్చనీయంశమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 02, 2022 09:15 AM