Viral Video: 70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు.. వీడియో

|

Sep 02, 2021 | 8:57 AM

ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్‌లో ఏ ఇళ్లు చూసిన డాబాలు, స్లాబ్‌లు, లేదంటే రేకులు..ఆనాటి తాటాకు పందిళ్లు, పెంకుటిల్లులు చూద్దామన్నా కనిపించవు..కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ వ్యక్తి పెంకుటిల్లును ప్రేమించాడు.

ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్‌లో ఏ ఇళ్లు చూసిన డాబాలు, స్లాబ్‌లు, లేదంటే రేకులు..ఆనాటి తాటాకు పందిళ్లు, పెంకుటిల్లులు చూద్దామన్నా కనిపించవు..కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ వ్యక్తి పెంకుటిల్లును ప్రేమించాడు. తాత కట్టిన పాతతరం భవంతిని కూల్చేయకుండా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాడు. దగ్గరుండి మరమ్మతులు చేయించాడు. పల్లెటూరి ఇంట్లోనే పట్నం వసతులు కల్పించాడు. కొత్తతరానికి సరికొత్త ఆలోచనను కానుక గా అందిస్తున్నాడు. పెంకుటిల్లు కూడా ఇంత అందంగా ఉంటుందా..? అని అందరూ మాట్లాడుకునే లా ఈ పెంకుటిల్లు అందర్నీ అబ్బురపరుస్తోంది… ఆ ఇంట్లో కాలుపెడితే అమ్మ ఒడిలో ఆడుకుంటున్న భావన. ఆ అరుగు మీద సేదతీరితే పట్టెమంచం మీద పవళించినంత సౌఖ్యం. అటువైపు నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరూ.. మనకూ ఇలాంటి ఓ ఇల్లుంటే ఎంత బాగుండేదని అనుకుంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈస్టర్ ఐర్లాండ్‌ దీవిలో శిల్పాల వెనుక రహస్యం..!! అంతుచిక్కని మిస్టరీ.. వీడియో

Kerala: కేరళలో మళ్లీ విజృంభణ.. కర్నాటకలో కంగారు, మహమ్మారి వ్యాప్తి అక్కడి నుంచే ఎక్కువట.!

Keerthi Suresh: మరో ఛాలెజింగ్‌ పాత్రలో మహానటి.. పెళ్లి కాకుండానే తల్లి క్యారెక్టర్‌లో నటిస్తున్న కీర్తి.. వీడియో