Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. తగిన సౌకర్యాలు లేక తిప్పలు.!

|

Oct 24, 2024 | 6:16 PM

మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాది మంది అయ్యప్ప భక్తులు.. శబరిమలకు పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి 10 గంటలు పైనే సమయం పడుతోంది. అయ్యప్ప క్షేత్రంలో అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని.. అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా.. కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో.. 10 గంటలైనా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు.

ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. అంతేకాకుండా శబరిమలలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలిగాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, తాగునీరు కూడా లేకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వ్యతిరేకంగా క్యూలైన్లలోనే భక్తులు నిరసన చేస్తున్నారు. మరోవైపు అక్టోబరు 21న శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో స్వామి దర్శనం అవుతుందో లేదోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.