ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??
స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని అనే పర్వతారోహకురాలు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ భూగర్భ గుహలో ఆమె దాదాపు 500 రోజులు ఒంటరిగా జీవించి ఔరా అనిపించింది. తాజాగా ఆమె ఆ గుహను వీడి ఏప్రిల్ 14న బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని అనే పర్వతారోహకురాలు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ భూగర్భ గుహలో ఆమె దాదాపు 500 రోజులు ఒంటరిగా జీవించి ఔరా అనిపించింది. తాజాగా ఆమె ఆ గుహను వీడి ఏప్రిల్ 14న బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది. భూగర్భంలో దీర్ఘకాలంపాటు ఒంటరిగా ఉంటే వ్యక్తులపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఆమె, 2021 నవంబరు 21న ఒంటరిగా 70 మీటర్ల లోతులో ఉన్న ఓ గుహలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆమెకు అవసరమైన ఆహారం, ఇతర సామగ్రిని తన బృంద సభ్యులు ఓ చోట పెట్టి వెళ్లిపోయేవారు. ఫ్లమిని వాటిని తీసుకొని, అవరసమైనవాటిని ఉపయోగించుకుని, అవసరం లేని వాటిని అక్కడే వదిలేసేది. ప్లమిని గుహలో పఠనం, చిత్రలేఖనం, నేత వంటి ఇష్టమైన పనులు చేస్తూ కాలం వెల్లదీసింది. ఆ గుహలో ఏర్పాటు చేసిన రెండు కెమెరాల సాయంతో తన అనుభూతులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి బయటకు పంపించేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్
కబ్‌బోర్డ్‌నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా కనిపించిన ??
కబడ్డీ డ్యాన్స్.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్..
Adipurush: ఆదిపరుష్ గ్రాఫిక్ .. ఇప్పుడు బెటర్‌గా కనిపిస్తుందోచ్