Fire Accident: స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం.

|

Oct 03, 2023 | 11:37 AM

స్పెయిన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మర్సియాలో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఉదయం ఆరు గంటలకు ప్రఖ్యాత టియేటర్‌ నైట్‌క్లబ్‌లో మంటలు మొదలై అంతటా వ్యాపించాయని స్పెయిన్‌ అధికార వార్తా సంస్థ ఈఎఫ్‌ఈ వెల్లడించింది. ప్రమాదానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు.

స్పెయిన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మర్సియాలో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఉదయం ఆరు గంటలకు ప్రఖ్యాత టియేటర్‌ నైట్‌క్లబ్‌లో మంటలు మొదలై అంతటా వ్యాపించాయని స్పెయిన్‌ అధికార వార్తా సంస్థ ఈఎఫ్‌ఈ వెల్లడించింది. ప్రమాదానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు కొన్ని గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. భవనం పై కప్పు కూలుతుందనే భయంతో బయటే ఉన్న సహాయ బృందాలు చివరరకు లోపలికి ప్రవేశించి ఊపిరాడక స్పృహ కోల్పోయిన కొందరిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. చిక్కుకుపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..