Sonu Sood: రియల్‌ హీరోకి ఈ తీరు సరికాదంటూ మందలించిన రైల్వే.. సోనూసూద్‌కు ముంబై పోలీసుల వార్నింగ్‌.

|

Jan 16, 2023 | 8:52 AM

కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి సాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకొని ఎంతో ప్రజాదరణ పొందారు. కానీ, ఈ మధ్య ఆయన చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు దారితీసింది.

సోనూసూద్‌కు ముంబై పోలీసుల వార్నింగ్‌..@TV9TeluguDigital
కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి సాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకొని ఎంతో ప్రజాదరణ పొందారు. కానీ, ఈ మధ్య ఆయన చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో అందరూ ఈ రియల్‌ హీరో తీరును ఎండగడుతున్నారు. నార్నర్త్ రైల్వే, ముంబై పోలీస్ కమిషనరేట్ సైతం సోనూసూద్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ రియల్‌ హీరోను మందలించారు కూడా. అసలేం జరిగిందంటే..సోనూసూద్‌ ఇటీవల కదులుతున్న రైలు డోర్ తీసి ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోనూసూద్‌ డిసెంబర్ 13వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోలో సోనూ.. వేగంగా వెళ్తున్న రైలులో డోర్ పక్కన కాళ్లపై ప్రమాదకరమైన రీతిలో కూర్చున్నారు. దీనిపై స్పందించిన నార్నర్త్ రైల్వే ఇది చాలా ప్రమాదకరం అంటూ సోనూని ట్విట్టర్‌ వేదికగా మందలించింది. ఆయనను భారత ప్రజలకు సోనూ సూద్ రోల్ మోడల్ అని, ఇలాంటి వీడియోతో దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని, ఇలా చేయొద్దని కోరింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా సోనూసూద్‌ను హెచ్చరించింది. ఇది ప్రమాదకరమని, సినిమాలో చేసినట్లు నిజ జీవితంలో చేయవద్దని తెలిపింది. అభిమానులు సైతం సోనూ సూద్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసి, స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇలా ప్రమాదకరమైన పనలు చేయకూడదని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 16, 2023 08:52 AM