తల్లిదండ్రులను కట్టేసి.. నడిరోడ్డుపై కూర్చోబెట్టిన కసాయి కొడుకులు
ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది. ధనదాహంతో కొందరు ఎంతకయినా తెగిస్తున్నారు. చివరకు నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు సుపుత్రులు. ఇలాంటి కసాయి కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు బందీలైన అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వేములవాడ సమీపంలోని తిప్పాపురం గ్రామానికి చెందిన సామనపల్లి పోచవ్వ
ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది. ధనదాహంతో కొందరు ఎంతకయినా తెగిస్తున్నారు. చివరకు నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు సుపుత్రులు. ఇలాంటి కసాయి కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు బందీలైన అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వేములవాడ సమీపంలోని తిప్పాపురం గ్రామానికి చెందిన సామనపల్లి పోచవ్వ, నర్సయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు.. లచ్చయ్య, శంకర్, రాజు. గత కొన్నిరోజులుగా ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారు. ఆస్తి విషయమై తల్లిదండ్రులతో పాటు మేనల్లుడితోనూ వీళ్లు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులతో గొడవకు దిగిన కొడుకులు అమానుషంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై అవమానకరంగా కూర్చోబెట్టారు.
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

