మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
హర్యానాలో ఒక జంట పది ఆడపిల్లల తర్వాత 11వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. పుత్రసంతానం కోసం తల్లి వరుస ప్రసవాలతో ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది. సామాజికంగా కుమారుడి ఆకాంక్ష తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది హర్యానాలో లింగ వివక్ష సమస్యను స్పష్టం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూర్వం పున్నామనరకం నుంచి తప్పించడానికి పుత్రుడు ఉండాలని భావించేవారు. కానీ ఇప్పడు కాలం మారింది. అయితే.. ఈ కాలంలో అమ్మాయిలు అన్ని రంగాలలోనూ అబ్బాయిలను వెనక్కి నెట్టి మరీ దూసుకుపోతున్నారు. అయినా ఓ జంట మాత్రం.. మగపిల్లవాడి కోసం ఏళ్ల తరబడి వేచిచూశారు. వరుసగా పది కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టినా.. 11వ సారైనా మగపిల్లవాడు పుడతాడని ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి కోరిక ఫలించి.. 11వ ప్రసవంలో వారికి మగసంతానం కలిగింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఫతేహాబాద్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల మహిళ జనవరి 3న ఆసుపత్రిలో చేరారు. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికే పదిసార్లు ప్రసవం కావడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఈ 11వ ప్రసవం అత్యంత ప్రమాదకరంగా మారిందని వైద్యులు తెలిపారు. ప్రసవ సమయంలో ఆమెకు మూడు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని, ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. జింద్ జిల్లా ఉచానా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరుదైన ప్రసవం జరిగింది. ఎట్టకేలకు తమ ఇంట మగబిడ్డ పుట్టడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాలుడి 10 మంది అక్కలు సైతం చిన్నారి తమ్ముడిని చూసి మురిసిపోయారు. తమ తమ్ముడికి వారు ‘దిల్‌ఖుష్’ అని పేరు పెట్టుకున్నారు. ఇంటి యజమాని సంజయ్ కుమార్ రోజువారీ కూలీగా పనిచేస్తూ తన 10 మంది కుమార్తెలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తెలు ఇంకా బడికి వెళ్లే వయసులో ఉన్నారు. తన పది మంది కుమార్తెల పేర్లను వరుసగా గుర్తుకు తెచ్చుకోవడానికి తండ్రి ఇబ్బంది పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమార్తెలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెబుతున్నప్పటికీ, కుమారుడు కూడా ఉండాలనే ఆకాంక్షతో మహిళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడంపై సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో లింగ నిష్పత్తి 2025 నాటికి 1000 మంది పురుషులకు 923 మహిళలకు మెరుగుపడినప్పటికీ, ఇప్పటికీ జాతీయ సగటు కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. కుమారుడి కోసం వరుస ప్రసవాలు చేయడం తల్లి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు
మీరు ట్రైన్ ట్రైన్ మిస్సైతే.. అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా
