Viral Video: అరెరే ఎంత పని అయ్యింది..! ప్రాణాలమీదకు తెచ్చిన సరదా..

Updated on: May 28, 2022 | 7:56 PM

ఓ యువకుడు సరదాకు చేసిన పని అతన్ని ఆస్పత్రి పాలు చేసింది. కర్నాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి


ఓ యువకుడు సరదాకు చేసిన పని అతన్ని ఆస్పత్రి పాలు చేసింది. కర్నాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్‌ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్‌ నీళ్లు కిందకు జారుతూ వాటర్‌ ఫాల్‌లా చూపరులను ఆకట్లుకుంటున్నాయి. అది చూసేందుకు స్థానికులు భారీ సంఖ‍్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాగా ఆ గోడపైకి ట్రెక్కింగ్‌ చేయబోయాడు. దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడు ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Published on: May 28, 2022 07:56 PM