స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియా రీల్స్ మోజు ప్రాణాంతకమని మరోసారి నిరూపితమైంది. లైకుల పిచ్చిలో భాగంగా, ఉరి వేసుకుంటున్నట్లు నటించి వీడియో తీస్తుండగా ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన రీల్స్ కోసం ప్రమాదకర చర్యలకు పాల్పడే యువతకు హెచ్చరికగా నిలుస్తుంది. వర్చువల్ అభినందనల కోసం జీవితాలను పణంగా పెట్టడం ఎంత ప్రమాదమో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.
సోషల్ మీడియా రీల్స్ మోజు, లైకుల పిచ్చి యువతను ఎంత ప్రమాదంలోకి నెడుతోందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. సరదా కోసం చిత్రీకరించాలనుకున్న రీల్ చివరకు విషాదాంతమై, ఓ యువతి ప్రాణాలను తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా వాసి 27 ఏళ్ల మోహినికి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అలవాటు. తన ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. దీనికోసం మెడకు తాడు బిగించుకుని ఓ స్టూల్‌పై నిల్చుని తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అయితే, కొన్ని క్షణాల్లోనే సీన్ రివర్స్ అయింది. ఆమె బ్యాలెన్స్ కోల్పోవడం లేదా కాలు జారడంతో స్టూల్ పక్కకు పడిపోయింది. దీంతో మెడకు బిగిసిన ఉరి నిజంగానే ఆమె ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. ఈ విషయాన్ని మొదట గమనించింది ఆమె నాలుగేళ్ల కుమార్తె. గదిలోకి వచ్చిన చిన్నారి, తల్లి ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగెత్తుకొచ్చి, దృశ్యం చూసి షాకయ్యారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నన్నారు. రీల్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంగానే ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం
కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..
అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్ చేయగా