బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

Updated on: Apr 02, 2026 | 3:36 PM

'దక్షిణ కాశీ'గా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా నాగుపాములు ప్రత్యక్షమవుతుండటం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు నాగుపాములు కనిపించడంతో అటు భక్తులు, ఇటు ఆలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆలయ ప్రాంగణంలోని భీమేశ్వర ఆలయం, రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో పాముల సంచారం పెరిగింది. ముఖ్యంగా గత వారం రోజులుగా మూడు భారీ నాగుపాములు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. తాజాగా, ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో సుమారు ఏడు అడుగుల పొడవైన నాగుపాము ప్రత్యక్షమవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, దర్శనానికి వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు. క్షేత్రంలో ప్రస్తుతం భారీ ఎత్తున పునర్నిర్మాణ మరియు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాత కట్టడాల తొలగింపు, నేల తవ్వకాలు జరుగుతుండటంతో పాముల ఆవాసాలు దెబ్బతిన్నాయని, అందుకే అవి బయటకు వస్తున్నాయని స్థానికులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.పాముల సంచారంపై సమాచారం అందుకున్న ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లను పిలిపించి, పాములను సురక్షితంగా పట్టించి సమీపంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో నిఘాను పెంచారు.

మరిన్ని వీడియోల కోసం :

డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌

పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!

వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్

Follow Us