Viral Video: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సిరివెన్నెల రాసిన పాట ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చింది. ఎంతకష్టం వచ్చిన చివరి వరకు పోరాడాలి.. కొంతమంది ఓటమిని అంత సులువుగా ఒప్పుకోరు..అలాంటి వారికి విజయం ఖాయం. మనం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే.. పట్టువదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే..ఈరోజు కాకపోయినా ఎప్పటికైన విజయం మన సొంతం అవుతుంది. దీనికి ఉదాహరణగా నిలిచే ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. కప్పు కనిపిస్తే పాము ఊరుకుంటుందా.. చటుక్కున చుట్టేసి లటుక్కున మింగేయదు.. కానీ ఈ వీడియోలో కూడా ఓ పాము కప్పను పట్టుకుంది. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.
ఈ వీడియోలో ఓ పాము కప్ప కాలును పట్టుకోవడం చూడవచ్చు. ఆ పాము నెమ్మదిగా కప్పను మింగడానికి ప్రయత్నించింది. కానీ కప్ప భయం లేకుండా తన శక్తితో పాము బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పాము బారి నుండి ప్రాణం కాపాడుకోవడం కోసం కప్పు ఇనుప గేటుపైకి ఎక్కడం మొదలు పెట్టింది. పాము నోటిలో ఆ కప్పు కాలు ఉన్నప్పటికీ, చాలా శ్రమతో గేటు పైకి ఎక్కింది.. చివరకు ఆ పాము లాభంలేదు అనుకోని కప్పను వదిలేసింది. దాంతో కప్పు బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి తుర్రుమంది. తన ఒక్క ధైర్యంతోనే ఈ చిన్న కప్ప పాము బారి నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘నెవర్ గివ్ అప్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా కప్ప ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 72.7k పైగా వ్యూస్ రాగా 5,000 పైగా లైక్‌లు వచ్చాయి.
Never give up ?
VC:Fred pic.twitter.com/7rLSDZeNCx— Susanta Nanda IFS (@susantananda3) April 2, 2022