Rat fight with Snake: ఎలుకను వేటాడబోయిన పాము.. రేట్ రివర్స్‌ ఎటాక్‌ అదుర్స్‌..! ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో

Updated on: Nov 18, 2021 | 9:37 AM

గుండెల్లో ధైర్యం, చేయగలం అనే ఆత్మ విశాసం, సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాం. ఇందుకు సరైన ఉదాహరణ ఈ వీడియో.. తనను పట్టుకోబోయిన పామునుంచి ఓ ఎలుక ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది.


గుండెల్లో ధైర్యం, చేయగలం అనే ఆత్మ విశాసం, సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాం. ఇందుకు సరైన ఉదాహరణ ఈ వీడియో.. తనను పట్టుకోబోయిన పామునుంచి ఓ ఎలుక ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. దీనకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు.

ఈ వీడియోలో.. ఓ పాము బూడిదలా కనిపిస్తున్న మట్టిలో నక్కి ఉంది. ఇంతలో అటువైపు ఒక ఎలుక వచ్చింది. ఎలుక కూడా పామును చూసింది. దాన్ని ఎలాగైనా పట్టుకొని మింగేయాలని పాము… పాము బారినుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఎలుక ఫిక్స్‌ అయినట్లు కనిపిస్తున్నాయి. పాము అదనుచూసి ఎలుకపై మెరుపు దాడి చేసింది. అలర్టయిన ఎలుక చాకచక్యంగా తప్పించుకుంది. ఆ ఎలుక పైపైకి ఎగురుతూ పామును తన బలాన్నంతా ఉపయోగించి కాళ్లతో తన్నుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘Syed Aliff’ అనే నెటిజన్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షల మంది నెటిజన్లు ‘ఇలాంటి పోరాటాన్ని ఇదే మొదటిసారి చూడటం’ అంటూ రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..