Snake vs Birds Fighting: పక్షి గూటిలో దూరిన పాము.. పిట్టలు అన్ని కలిసి పీకి పాతరేసిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..

|

Feb 16, 2022 | 6:34 PM

తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. సమస్త జీవరాశికి వర్తిస్తుంది. చిన్న కీటకాలు సైతం తమ పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి తల్లి ప్రేమకు సంబంధించినదే ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీన్‌...


తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. సమస్త జీవరాశికి వర్తిస్తుంది. చిన్న కీటకాలు సైతం తమ పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి తల్లి ప్రేమకు సంబంధించినదే ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీన్‌… చెట్టుపై ఓ పక్షి ఏర్పాటు చేసుకున్న గూట్లోకి భారీ సైజున్న పాము ఒకటి దూరింది. పక్షి గుడ్లను తినేందుకు పామును యత్నిస్తుంది..అది గమనించిన తల్లి పక్షి.. గుడ్లకు ప్రమాదం జరగకుండా పాముతో పోరాడుతుంది.. ఆ పాము నోటికి పక్షి గుడ్లు దక్కకుండా తన పదునైన ముక్కుతో పొడిచి పొడిచి పాముకు చుక్కలు చూపింది. పక్షి దాడికి తట్టుకోలేకపోయిన పాము.. మొదట భయపెట్టేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ పక్షి వెనక్కి తగ్గలేదు..దాంతో ఇక చేసేది లేక ఆ విషసర్పం కాస్త తోక ముడిచింది. బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి పలయానం చిత్తగించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లిగా పక్షి చేసిన సాహసానికి నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరిన్ని చూడండి ఇక్కడ: