ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు..ఊహించని విధంగా

Updated on: Nov 06, 2025 | 3:55 PM

ఇప్పటివరకూ వర్షాలు వరదలతో వాగులు, వంకలు, అటవీప్రాంతాలు నీటమునగడంతో పాములు, తదితర జీవులు జనావాసాల్లో హల్ చల్ చేశాయి. ఇక .. శీతాకాలం ప్రారంభం కావటంతో నెమ్మదిగా చలి పెరుగుతుండటంతో వెచ్చదనం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జనావాసాల్లో పాములు, కొండచిలువలు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ప్రమాదం ఏ క్షణమైనా పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విజయనగరం రాజాం డోలపేటలో అలాంటి ఘటనే జరిగింది. ట్యూషన్‌కు వెళ్తున్న ఓ విద్యార్ధి ఊహించని విధంగా పాముకాటుకు గురయ్యాడు. ట్యూషన్‌కి వెళ్లిన బాలుడు క్లాసు అయిపోగానే తన సైకిలుపై ఇంటికి బయలుదేరాడు. సైకిలు ఎక్కగానే అందులో నక్కిన రక్తపింజర పాము బాలుడి కాలుకి చుట్టేసింది. దీంతో భయపడిన బాలుడు పాము నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పాము బాలుడి కాలుపై కాటేసింది. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో ప్రాణాపాయం తప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంట నష్టం కింద రైతుకు పరిహారంగా రూ.2.30

భారీ షాక్‌‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి

పిల్లలను తినేస్తున్న పులి.. పాపం చిన్నారి

శివాలయంలో పునరుద్ధరణ వేళ.. బయటపడిన నిధి

వరదలో కొట్టుకొచ్చిన బంగారు గాజులు.. నూటికో కోటికో ఒకరే అతడిలా

Published on: Nov 06, 2025 03:34 PM