Viral Video: 24 ఏళ్ల తర్వాత లిఫ్ట్‌ తలుపులు తెరిచిన ఆస్పత్రి సిబ్బంది.. లోపలేముందో చూస్తే షాక్‌ ! (వీడియో)

|

Sep 09, 2021 | 8:56 AM

ఓ ఆస్పత్రిలోని లిఫ్ట్‌ కొద్దికాలంపాటు పనిచేసి పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్‌ను ఎవరూ వాడటం లేదు. తాజాగా రిపేర్‌ చేయాలని నిర్ణయించిన ఆసుపత్రి యాజమాన్యం, పనిచేయకుండా పోయిన లిఫ్ట్‌ను తెరిపించింది.

ఓ ఆస్పత్రిలోని లిఫ్ట్‌ కొద్దికాలంపాటు పనిచేసి పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్‌ను ఎవరూ వాడటం లేదు. తాజాగా రిపేర్‌ చేయాలని నిర్ణయించిన ఆసుపత్రి యాజమాన్యం, పనిచేయకుండా పోయిన లిఫ్ట్‌ను తెరిపించింది. 24 ఏళ్ళ తర్వాత తెరుచుకున్నాయి లిఫ్ట్‌ తలుపులు. లోపల కనిపించిన సీన్‌ చూసి షాక్‌కి గురయ్యారు సిబ్బంది . అందులో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌ కైలీలోని EPCE ఆసుపత్రిని 1991లో నిర్మించారు. అందులోని లిఫ్ట్‌ కొద్దికాలంపాటు పనిచేసి ఆగిపోయింది. తాజాగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన ఆసుపత్రి యాజమాన్యం ఆ లిఫ్ట్‌ను తెరిపించింది. 24 ఏళ్ల తర్వాత తలుపులు తెరుచుకోగా.. అందులో పూర్తిగా ధ్వంసమైపోయిన ఓ అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది.

విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపించారు. ఆ తర్వాతమిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. పనిచేయకుండాపోయిన లిఫ్ట్‌లోకి మృతదేహం ఎలా వచ్చింది? లిఫ్ట్‌ ఆగిపోయిన సమయంలో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడా? లేదా ఎవరైనా అతడిని హత్య చేసి అందులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడిని గుర్తించేందుకు 24 ఏళ్ల క్రితం మిస్సింగ్‌ పర్సన్స్‌ సమాచారం సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి:Ants in aircraft: ఫ్లైట్ జర్నీలో జాగ్రత్త..! విమానంలో భయపెట్టిన ఎర్ర చీమల దండు..!వీడియో వైరల్

Afghanistan Crisis Live Video: ఆఫ్ఘనిస్థాన్ మహిళలపై పెరిగిన అరాచకాలు.. తాలిబన్లపై తిరగబడ్డ మహిళ..!(వీడియో).

Ashu Reddy-RGV video: బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూలో రచ్చ.. ఆర్జీవికి ముద్దు పెట్టిన అషు రెడ్డి(వీడియో).

YS Sharmila: ఎవరి కోసం ఎవరున్నారు..?పొండిరా పోండి..!షర్మిలకు షాక్ ల మీద షాక్ లు..!(వీడియో).