Loading video

Firecracker: పని కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి.. ఆరుగురి సజీవదహనం.

|

Aug 29, 2023 | 8:29 AM

బతుకు దెరువు కోసం వెళ్లిన సజీవ దహనమయ్యారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌‌లో చోటు చేసుకుంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది.

బతుకు దెరువు కోసం వెళ్లిన సజీవ దహనమయ్యారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌‌లో చోటు చేసుకుంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే.. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని సమాచారం. పశ్చిమబెంగాల్‌ స్టేట్‌ యూనివర్సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పక్కనే ఇళ్లలో నివసిస్తున్నవారిని అధికారులు అప్రమత్తం చేసి.. అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహకులపై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..