ఓర్నాయనో..అవి మునక్కాయలా..పొట్లకాయలా..వీడియో
మామిడిపళ్లలో నూజివీడు రసాలు ఎంత ఫేమస్సో.. ఆ ఊళ్లో ఓ ఇంట్లోని మునగచెట్టు అంత ఫేమస్… మా మునగచెట్టుకు కాస్తాయ్ మునక్కాయలో… మునక్కాయలో… అంటూ రాగాలు తీస్తున్నారట అక్కడి జనాలు… సాధారణంగా మునక్కాయలు రెండు లేదా మహా అయితే 3 అడుగుల పొడవుంటాయి… కానీ, ఆ ఇంటి పెరట్లో ఉన్న మునగచెట్టు కాయలు మనిషంత ఎత్తు పెరుగుతున్నాయి… ఈ విషయాన్ని ఆ ఊరి జనం వింతగా చెప్పుకుంటున్నారు… ఆ విత్తనాలు తీసుకెళ్లి వారి ఇళ్లలో కూడా మునగచెట్లను పెంచుకుంటున్నారట… ఇంతకీ ఎక్కడుందా చిత్రమైన మునచెట్టు..?
బాపట్ల జిల్లా మార్టూరు నేతాజీ నగర్‌లోని శానం లక్ష్మీ ఇంటి ఆవరణలో మునగ చెట్టు విరగ కాపు కాసింది. ఆకుల కన్నా కాయలు ఎక్కువగా కనిపించటం … అవి కూడా ఐదు, ఆరు అడుగుల పొడవు ఉండటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి పొడవైన మునగ కాయలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఆశ్చర్యంగా కాపు కాసిన మునక్కాయలు చూసేందుకు ఊళ్ళో జనం తరలివస్తున్నారు. ఒక్కో కాయ ఆరు అడుగుల పైనే పొడవు ఉండటమే కాకుండా చెట్టు అసాధారణ రీతిలో విరగకాసింది. రైతులు ఇలాంటి మునగ పంటను పండిస్తే లాభాల పంటగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే అన్ని చెట్లు ఇలా విరగకాసే అవకాశాలు తక్కువంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. జన్యు పరమైన కారణాల వల్ల చాలా అరుదుగా మాత్రమే ఇలా విరగకాపు ఉంటుందంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్ వాటే లైఫ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

