Fire house: చంద్రగ్రహణం నుంచి రోజూ మంటలు.. ఆ ఇంట్లో అసలేం జరగుతోంది..? వీడియో
చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎనిమిది రోజుల పాటు రోజూ ఇలాగే జరగడంతో ఆ ఇంట్లో ఉండే వాళ్లు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో జరిగుతోంది.
కమల్ పాండే రెండు అంతస్థుల భవనంలో అతని తమ్ముడి కుటుంబంతో కలిపి మొత్తం 9 మంది ఉంటున్నారు. అయితే.. నవంబరు 8 న చంద్రగ్రహణం తర్వాత సాయంత్రం ఏడు గంటలకు ఇంట్లో ఉన్న విద్యుత్ బోర్డులో మంటలు వచ్చాయి. వారు వెంటనే అలర్ట్ అయ్యి వాటిని ఆర్పివేశారు. ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బోర్డు సరి చేయించారు. అయినా ఆ తర్వాతి రోజూ వాష్ రూమ్ లోని ఎలక్ట్రిక్ బోర్డులో మంటలు అంటుకున్నాయి. దీంతో ఇక లాభం లేదని విద్యుత్ కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. అయినా కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుంటుంబం తమ ఇంటి ముందున్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చారు. రక్షణ కోసం ఇద్దరు సోదరులు అక్కడే పహారా కాసేవారు. అయినా ఆ తర్వాత కూడా మంటలు చెలరేగాయి.విషయం తెలిసుకున్న మెజిస్ట్రేట్ రిచా సింగ్.. పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. మంగళవారం చివరిసారిగా ఆ ఇంట్లో మంటలు వచ్చాయి. బుధవారం నుంచి మంటలు కనిపించలేదు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. కాగా.. విషయం తెలిసుకున్న స్థానికులు ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు. కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భూకంపం కారణంగా భూమి లోపల ఉండే వాయువుల లీకేజీ కారణంగా ఇలా జరిగుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..