Beaten Child on Road: దారుణం.. చిన్నారిని నేలకేసి కొట్టిన దుర్మార్గుడు.! సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో.
కేరళలో దారుణం వెలుగుచూసింది. కారణం లేకుండానే ఓ బాలికను దుర్మార్గుడు నేలకేసి కొట్టాడు. చిన్నారి బలమైన గాయాలతో మంగళూరు ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన కాసర్గోడ్ జిల్లా ముంజేశ్వర్ పట్టణంలో జరిగింది.
స్కూల్‌కి వెళ్తూ రోడ్డు పక్కన నిల్చున్న ఎనిమిదేళ్ల చిన్నారిని అబూబాకర్ సిద్ధిక్ అనే వ్యక్తి గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టాడు. ఎలాంటి కారణం లేకుండానే రోడ్డు పక్కన నిల్చున్న చిన్నారిపై తన ప్రతాపం చూపించాడని స్థానికంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్కూల్‌లోని సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఉదయం బాలిక తన మామను తీసుకెళ్లేందుకు మదర్సా వెలుపల వేచి ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..