త్రివేణీ సంగమంలో సైబీరియన్ పక్షుల సందడి
శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో చలికాలంలో సందడి చేస్తాయి. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోతుంది. తాజాగా రష్యాలోని సైబీరియన్ వలస పక్షులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ తీరానికి చేరుకున్నాయి. త్రివేణి సంగమం వద్ద వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి.
శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో చలికాలంలో సందడి చేస్తాయి. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోతుంది. తాజాగా రష్యాలోని సైబీరియన్ వలస పక్షులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ తీరానికి చేరుకున్నాయి. త్రివేణి సంగమం వద్ద వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. త్రివేణీ సంగమంలో సైబీరియన్ వలస పక్షులు నీటిపై ఎగురుతూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రంగు రంగుల ఈ పక్షులను సెల్ఫీలతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. బోటు షికారు చేస్తున్న పర్యాటకుల చెంతకు వచ్చి వారు ఆ పక్షులకు వేసే గింజలను ఎంతో చాకచక్యంగా అందుకుంటూ ఆరగిస్తున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో సైబీరియన్ పక్షులు ఈ నదీ తీరాలకు వలస వస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో పనిచేసే బాలికపై యజమాని చిత్రహింసలు.
మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల.. హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్
Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్
Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ
Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??