3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగీలాల్ అనే బిచ్చగాడు కోటీశ్వరుడని తేలింది. మూడు ఇళ్లు, కారు, ఆటోలు వంటి కోట్లాది రూపాయల ఆస్తులున్న ఇతను భిక్షాటనతో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. అధికారులు భిక్షాటన నిర్మూలన ప్రచారంలో రక్షించగా ఈ నిజం బయటపడింది. అతని లగ్జరీ జీవితం, దాచిన సంపద అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఒక బిచ్చగాడి ఆస్తుల చిట్టా చూసి అందరూ కళ్లు బైర్లు కమ్మాయి. అతని లగ్జరీ లైఫ్ చూసి ప్రభుత్వ అధికారులు నోరెళ్లబెట్టారు. అతను సాదాసీదా బిచ్చగాడు కాదు, అక్షరాలా కోటీశ్వరుడు. రోజూ అందరు ఇచ్చే ముష్టి డబ్బులతో ఓ బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు.ఇళ్లు, వ్యాపారాలకు అద్దెకివ్వడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా కట్టాడు.మధ్యప్రదేశ్‌లో ఇండోర్ వీధుల్లోని సరాఫా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు. అతనికి మూడు ఇళ్ళు, ఒక కారు, మూడు ఆటో రిక్షాలు ఉన్నాయి. ఆ యాచకుడిని మంగీలాల్‌గా గుర్తించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న భిక్షాటన నిర్మూలన ప్రచారంలో భాగంగా మంగీలాల్‌ను రక్షించింది. అతని నిజమైన గుర్తింపు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. సరఫా వీధుల్లో చెక్క బండి, వీపు మీద బ్యాగు, చేతుల్లో బూట్లు వేసుకుని తిరిగే మంగీలాల్ అందరి సానుభూతిని పొందాడు. అతను రోజుకు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదిస్తాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. ప్రజల వద్దకు వెళ్లేవాడు. ప్రజలు స్వయంగా అతనికి డబ్బు ఇచ్చేవారు. విచారణలో, సరఫా ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులకు అప్పుగా డబ్బులు ఇచ్చినట్లు తేలింది. భిక్షాటన చేయడం ద్వారా సంపాదించిన డబ్బులను ఉపయోగించానని మంగీలాల్ అంగీకరించాడు. అతను రోజువారీ, వారపు ఆధారంగా వడ్డీ రేట్లపై డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. వడ్డీని వసూలు చేయడానికి ప్రతిరోజూ సరఫా ప్రాంతానికి వస్తున్నట్లు గుర్తించారు. భగత్ సింగ్ నగర్‌లో ఆయనకు మూడంతస్తుల ఇల్లు ఉంది. శివనగర్‌లో 600 చదరపు అడుగుల బిల్డింగ్, అల్వాస్‌లో 10 బై 20 అడుగుల BHK ఇల్లు కూడా ఉన్నాయి. అల్వాస్‌లోని ఇంటిని తన వైకల్యం ఆధారంగా ప్రభుత్వం రెడ్‌క్రాస్ సహాయంతో అందించింది. ఇంకా, మంగీలాల్‌కు మూడు ఆటో-రిక్షాలు ఉన్నాయి, వాటిని అతను అద్దెకు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. అతనికి డిజైర్ కారు కూడా ఉంది. దానిని నడపడానికి అతను ఒక డ్రైవర్‌ను కూడా నియమించుకున్నాడు. అతని గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాయిలెట్‌లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
SBI New Rules: రూల్స్ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత
Pomegranate Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. ఇంక అంతే సంగతులు