Safety Pin: పిన్నీసు ధర రూ. 69 వేలు ??

Updated on: Nov 09, 2025 | 2:46 PM

ప్రాడా (Prada) లగ్జరీ బ్రాండ్ ఇటీవల ₹69,000 విలువైన సేఫ్టీ పిన్‌ను విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ఒక సాధారణ పిన్‌కు కేవలం రంగుల దారాలు, చిన్న ట్యాగ్‌తో ఈ భారీ ధర పలకడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. లగ్జరీ బ్రాండింగ్ పిచ్చిపై చర్చ రేకెత్తించిన ఈ ఉత్పాదనపై ఆగ్రహం వ్యక్తమవడంతో, ప్రాడా ఆ లింక్‌ను తొలగించింది.

ఒక సాధారణ సేఫ్టీ పిన్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే పది రూపాయలో, ఇరవై రూపాయలో ఉంటుంది. డిజైన్ ఎక్కువగా ఉండేది అయితే ఓ వంద రూపాయల వరకూ ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే ఓ సాధారణ సేఫ్టీ పిన్ ధర ఏకంగా 69 వేల రూపాయలు. మహిళలందరి దగ్గరా నిత్యం ఉండే ఈ సేఫ్టీ పిన్‌ ధర ఇంత ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ దీని రేటు ఇంతలా ఉండడానికి కారణమేంటి? అత్యంత సాధారణ వస్తువులకు విపరీతమైన ధరలు పెట్టే లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ ప్రాడా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రాడా విడుదల చేసిన ఈ సేఫ్టీ పిన్ యాక్సెసరీకి.. అల్లిన నూలు, చిన్న ప్రాడా ట్యాగ్ మాత్రమే ఉన్నాయి. వీటికి ఏదో డైమండ్, బంగారపు బాల్స్ వంటివి ఉంటే ఆ మాత్రం ధర పెట్టొచ్చు. కానీ సేఫ్టీ పిన్‌కి రంగుల దారాలు చుట్టి 69 వేలకు అమ్మడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓ ఇంటర్నెట్ యూజర్ పిన్నీసును తీవ్రంగా విమర్శిస్తూ.. “మా అమ్మమ్మ దీనికంటే బాగా చేస్తుంది” అని ఘాటుగా రాసుకొచ్చాడు. ఈ పిన్‌ను కొంటే.. దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి యాపిల్ కేర్ మాదిరిగా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సిందేనని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ లగ్జరీ బ్రాండింగ్ పిచ్చిపై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతుండగా.. ప్రాడా ప్రస్తుతం ఈ ఉత్పత్తిని అమ్ముతున్న లింక్ ను తీసేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రో.. ఈ మేకను తీసుకొని.. ఆలుగ‌డ్డలివ్వు..

నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు

ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్‌ సీన్‌

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. కాటు వేస్తే

ఆ ఆలయంలో ఎలుకలే దేవుళ్లు..!