Crime: దారుణం.. ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ దాడి.. ఏం చేశారో తెలుసా!

|

Apr 01, 2024 | 11:56 AM

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సులో ఓ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు బస్సు డ్రైవర్‌ ఇంకా కండక్టర్‌. దాడిలో భాగంగా ప్రయాణికుడి చెవి, చేతి వేలు కొరికేశారు. వారి బారినుంచి ఎలాగో తప్పించుకున్న ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి వివరాలు ప్రకారం..

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సులో ఓ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు బస్సు డ్రైవర్‌ ఇంకా కండక్టర్‌. దాడిలో భాగంగా ప్రయాణికుడి చెవి, చేతి వేలు కొరికేశారు. వారి బారినుంచి ఎలాగో తప్పించుకున్న ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి వివరాలు ప్రకారం.. కుల్దీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గురువారం కైసర్‌ బాగ్‌ బస్‌ స్టేషన్‌ నుంచి బిస్వాన్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు. సీతాపూర్‌ వద్ద అతను బస్సు ఎక్కాడు. బస్సులోఎ ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు. కండక్టర్‌ వచ్చి అతడిని వేరే సీటులో కూర్చోమని చెప్పాడు. ఎందుకని అడిగితే బస్సు దిగిపొమ్మని బెదిరించాడు. ఈ క్రమంలో డ్రైవర్‌తోపాటు బస్సులో ఉన్న మరికొందరు కుల్దీప్‌ కుమార్‌పై దాడికి దిగారు. తన చేతి చిటికెన వేలు, చెవిని కొరికేశారని తెలిపాడు. అంతేకాదు తనవద్ద ఉన్న బంగారు గొలుసు, రూ.19,600ల నగదు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి బారినుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్సుడ్రైవర్‌, కండక్టర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు వాఝీర్‌గంజ్ పోలీస్ అధికారి దినేష్ మిశ్రా వెల్లడించారు. అలాగే యూపీఎస్ఆర్‌టీసీ కూడా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన ఇద్దరికి నోటీసులు ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..