భూకంప సమయంలో పురిటినొప్పులు..వైద్యులు ఏం చేశారంటే వీడియో

Updated on: Apr 04, 2025 | 8:37 PM

మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు కుదిపేశాయి. ఈ ప్రకృతి విపత్తులో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, ప్రకంపనల సమయంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. భూకంపం వచ్చిన సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు పార్కులో డెలివరీ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. భూ ప్రకంపనల నేపథ్యంలో బీఎన్‌హెచ్‌, కింగ్‌ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్‌ ఆస్పత్రుల్లోని రోగులను వైద్యులు దగ్గర్లోని పార్కుకి తరలించారు. రోగులకు అక్కడే వైద్య సదుపాయాలు అందించారు. ఈక్రమంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమెను స్ట్రెచర్‌పై ఉంచి పార్క్‌ వద్ద డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.కాగా, భూప్రకంపనల కారణంగా కూలిన భవనాల శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో

అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో

చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

Published on: Apr 04, 2025 08:34 PM