లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో

Updated on: Apr 10, 2025 | 7:16 PM

మనుషుల మధ్యే కాదు.. మూగజీవుల మధ్య కూడా ప్రాంతీయ ద్వేషాలు.. గట్టు పంచాయతీలు ఎలా ఉంటాయో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది. తమ ప్రాంతంలో ఆహారం దొరక్క మరో ప్రాంతంలోకి చొరబడిన కోతులపై స్థానిక కోతులు ఏ రేంజ్‌లో తిరగబడ్డాయో చూస్తే ఆశ్చర్యపోతారు. రెండు ప్రాంతాలకు చెందిన వానర మూకల మధ్య భీకర యుద్ధమే జరిగింది. ఒకటి కాదు రెండుకాదు వందలాది కోతులు ముష్టియుద్ధానికి పాల్పడ్డాయి.

కోతుల మూకల దాడులతో ఇళ్లనుంచి జనాలు బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. తలుపులు మూసి ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ వానరయుద్ధం చూసి స్థానికులు హడలెత్తిపోయారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో నిత్యం కోతులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఇది సరిపోదన్నట్టు సోమవారం ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు ఉదయాన్నే వందలాది కోతులు ఈ గ్రామంలో చొబడ్డాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కోతుల గుంపు వాటిని అడ్డుకున్నాయి. దాంతో వలస వచ్చిన కోతులకు, స్థానిక కోతులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పరస్పర దాడుల్లో రక్తం వచ్చేలా దాడులు చేసుకున్నాయి. గ్రామంలో కర్ఫ్యూ విధించారా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. ఒక్కరు కూడా ఇళ్లలోనుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటల పాటు కోతుల మధ్య బీకర వార్ జరిగింది. అనంతరం కోతులు తలోదిక్కూ వెళ్లిపోయాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో