Shocking accident: రోడ్డుపైన అడ్డదిడ్డంగా వెళ్తే.. ఇలాగే ఉంటుంది.. వీడియో లేకపోతే నమ్మలేరు..!

Shocking accident: రోడ్డుపైన అడ్డదిడ్డంగా వెళ్తే.. ఇలాగే ఉంటుంది.. వీడియో లేకపోతే నమ్మలేరు..!

Anil kumar poka

|

Updated on: Feb 27, 2023 | 9:08 AM

రోడ్డుమీద వాహనాలు నడిపేటప్పుడే కాదు, నడిచి వెళ్తున్నప్పుడుకూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఏవైపునుంచి ఏరూపంలో వస్తుందో తెలీదు. ఇటీవల కొందరు వాహనాలు

పంజాబ్ లోని నవాన్ షహర్-ఫగ్వారా నేషనల్ హైవే మీద ఓ స్విఫ్ట్ కారు వెళుతోంది. ఆ కారులో ఉన్న వ్యక్తి కారును ఇష్టం వచ్చినట్లు డ్రైవ్‌ చేస్తున్నాడు. పాములా మెలికలు తిరుగుతూ కారు నడుపుతున్నాడు. అది చూసి రోడ్డు మీద వెళ్తున్న ఇతర వాహనాల్లోని వారు కాస్త కంగారు పడ్డారు. అతను మద్యం సేవించి డ్రైవ్‌ చేస్తున్నాడా, లేక మరేదైనా కారణమై ఉంటుందా అని ఆలోచించే లోపే ఘోరం జరిగిపోయింది. విన్యాసాలు చేస్తున్న వ్యక్తి కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా పల్టీ కొట్టి పొగలు కక్కుతూ ధ్వంసమైంది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అతని పరిస్థితి ఏమిటీ అనేది క్లారిటీ లేదు. కానీ, ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇలా వాహనాలు నడిపేవారు దయచేసి వెనక తమకోసం ఎదురుచూసే కుటుంబాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 27, 2023 09:08 AM