కొత్త కారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి.. ఘోర ప్రమాదం వీడియో
ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఇష్టమైన కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసింది. అయితే దాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చే ముందు.. షోరూమ్‌లోనే నిమ్మకాయలు తొక్కించాలనుకుంది. ఎదురుగా నిమ్మకాయలు పెట్టి కొత్త థార్‌ను నడపబోయింది. ఈక్రమంలో మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేశ రాజధానికి సమీపంలోని ఘజియాబాద్‌లో జరిగింది.
ఘజియాబాద్ నివాసి అయిన 29 ఏళ్ల మాని.. ఎంతో కష్టపడి పొదుపుచేసిన డబ్బుతో తనకు ఇష్టమైన కొత్త మహీంద్రా థార్‌ను కొనుగోలు చేసిది. భర్త ప్రదీప్‌తో కలిసి దాన్ని డెలివరీ తీసుకోవడానికి ఢిల్లీలోని మహీంద్రా షోరూమ్‌కు వచ్చింది. ఆ కారు విలువ సుమారు 27 లక్షల రూపాయలు కాగా.. కారును బయటకు తీసుకెళ్లే ముందు షోరూమ్‌లోని మొదటి అంతస్తులో నిలిపి ఉంచిన కారు టైరు ముందు నిమ్మకాయలను పెట్టి..వాటిని తొక్కించాలని చూశారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను బలంగా నొక్కారు.దీంతో ఒక్కసారిగా కారు షోరూమ్ గాజు గోడను బద్దలు కొట్టుకుంటూ బయటకు వెళ్లి కిందనున్న ఫుట్‌పాత్‌పై పడింది. ప్రమాద సమయంలో కారులో మానితో పాటు షోరూమ్ ఉద్యోగి వికాస్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీడియోలో కారు పూర్తిగా తలక్రిందులుగా ఉండటం, చుట్టూ గాజు ముక్కలు చెల్లాచెదురై ఉండటం కనిపించింది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌లు వెంటనే తెరుచుకోవడంతో వారికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే వెంటనే స్పందించి సిబ్బంది వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు
మరిన్ని వీడియోల కోసం :
లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్ కపుల్.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో
ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో
