కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్‌.. ట్వీట్‌ వైరల్‌

|

Jul 04, 2022 | 9:06 PM

ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు.

ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు. ఇందులో కప్‌ టీ ధర 20 మాత్రమే. దీనికి సర్వీస్‌ ఛార్జీ 50 చెల్లించాల్సి వచ్చింది. దీంతో తీరా టీ తీసుకుని బిల్లు అందుకున్న ప్రయాణికుడు కంగుతిన్నాడు. అతడు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వినోద్‌ వర్మ అనే ప్రయాణికుడు దిల్లీ- బోపాల్‌ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జూన్‌ 28న ప్రయాణించాడు. కప్‌ టీ కొన్నందుకు గానూ అతడు 70 రూపాయలు చెల్లించాడు. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ ఇచ్చిన ఇన్‌వాయిస్‌ను ట్విటర్‌లో పెడుతూ ‘ 20 రూపాయల టీకి 50 రూపాయల సర్వీస్‌ ఛార్జ్‌.. మరీ ఇంత దోపిడీయా?’ అంటూ ట్వీటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..

షాపుముందు పార్క్‌ చేసిన బైక్‌.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్‌ రోడ్‌

Published on: Jul 04, 2022 09:06 PM