రియల్ ఎస్టేట్‌లో నయా ట్రెండ్.. పోతే రూ.వెయ్యి.. వస్తే ఇల్లు
ఈమధ్య కాలంలో ఇళ్లు లేదా షాపులను అమ్మాలనుకునేవాళ్లు ఓ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. దీని కోసం ఓ కొత్త ఐడియాను ఫాలో అవుతున్నారు. ఇళ్లు అమ్మకానికి పెడితే ఎవరూ సరైన ధరకు కొనడం లేదని లక్కీ డ్రాను ఆశ్రయిస్తున్నారు. తమ ఆస్తులకు సంబంధించి లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000 వరకు ధర ఉన్న కూపన్లను అమ్ముతున్నారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మీడియాలో… పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ఇల్లు అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ నయా ట్రెండ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాపులర్ అవుతోంది. నల్లగొండలోని డీఈఓ కార్యాలయం సమీపంలో రమేష్ అనే వ్యక్తికి 147 గజాల స్థలంలో ఆరు గదుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని అమ్మకానికి పెట్టగా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో రమేష్ వినూత్నంగా ఆలోచించి, లక్కీ డ్రా పద్ధతిలో ఇల్లు విక్రయానికి పెట్టాడు. రూ.999 రూపాయల చొప్పున మొత్తం 3,000 కూపన్లు అమ్మాడు. ఇంటిని చూడాలనుకునే వారు బ్రోచర్ మీద ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేస్తే ఇంటి లొకేషన్ వివరాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. వెయ్యిరూపాయలతో కూపన్ కొనుగోలు చేస్తే.. అదృష్టం కలిసి రావచ్చన్న ఆలోచనతో కొందరు కూపన్లు కొన్నారు. డ్రాలో ఇల్లు గెలుపొందవచ్చనే ఆశతో ఈ లక్కీడ్రాలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మూడు నెలల క్రితం రాంబ్రహ్మం.. తన ఇంటిని విక్రయించేందుకు లక్కీ డ్రాను ఫాలో అయ్యారు. రూ.500 చొప్పున 3,600 మంది కూపన్లు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొన్నారు. దీని ద్వారా ఆ యజమానికి రూ.18 లక్షల మొత్తం చేతికి అందింది. 500 రూపాయల కూపన్ కొనుగోలు చేసిన శంకర్ అనే వ్యక్తి.. 66 గజాల స్థలాన్ని లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్నాడు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నయా ట్రెండ్ హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నో ఫోటో షూట్, నో హగ్స్.. పెళ్లికొడుకు పది డిమాండ్లు ఇవే
పాన్‌కార్డ్ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక
గుడికి వెళుతుండగా చైన్ స్నాచింగ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్
భయం భయంగా తిరుమలకు శ్రీవారి భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే
