Underwater Wedding: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కొంతమంది రొటీన్ కి భిన్నంగా పనులు చేస్తూ.. వార్తల్లో నిలవాలని కోరుకుంటారు. ధరించే దుస్తులనుంచి అన్నిటిలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకునే యువత రోజు రోజుకీ అధికమవుతుంది. ఇక ఇటీవల కాలంలో సంప్రదాయంగా చేసుకునే పెళ్ళిళ్ళలో కూడా తమదైన ముద్ర వేయాలని.. వెరైటీ చేసుకోవాలని కొంతమంది యువతీయువకులు ఆరాటపడిపోతున్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఆందుబాటులోకి వచ్చిన తర్వాత తాము చేసిన పనులు ప్రపంచం మొత్తం చెప్పుకోవాలనే ఆరాటం అధికమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ యువ జంట తమ పెళ్లి వేదికగా నీటిని మార్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…
తమ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాలని విమానంలో, పడవల్లో పెళ్లి చేసుకుంటారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ జంట పెళ్లి చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఎక్కడ వివాహం చేసుకున్నారో తెలుసా.?
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నట్టుగా.. ఓ జంట నీటి అడుగున ఒక్కటై క్యా సీన్ హై అనిపించారు. స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ కొత్త జంట.. ఏకంగా నీటి అడుగున స్విమ్మింగ్ చేస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు. స్కూబాపై తమకు ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నామని, అందుకే ఇలా వెరైటీ పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈ జంట. ఇంగ్లండలోని బర్మింగ్‌హామ్‌లోని బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్‌లో ఇలా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
Couple become the first bride and groom in the UK to have an underwater wedding pic.twitter.com/XxLmssxrlW
— The Sun (@TheSun) September 10, 2021
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..