రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

Updated on: Jan 03, 2026 | 11:38 AM

గుంటూరులో షాకింగ్ ఘటన! మురళీకృష్ణ అనే విద్యార్థి స్నేహితులతో పందెం కాసి మూడేళ్ల క్రితం పెన్ను మింగేశాడు. ఇటీవల తీవ్ర కడుపునొప్పితో బాధపడగా, గుంటూరు జీజీహెచ్‌లో వైద్యులు సీటీ స్కాన్ చేసి పెన్ను గుర్తించారు. శస్త్రచికిత్స లేకుండానే విజయవంతంగా తొలగించి ప్రాణాలు కాపాడారు. విద్యార్థులు పందేలు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

స్కూల్లో విద్యార్ధులు సరదాగా పందేలు వేసుకోవడం సహజం. అయితే అవి శృతి మించి ప్రాణాలమీదకు తెచ్చేలా ఉండకూడదు. అలాంటి ఘటనే జరిగింది గుంటూరులో. మూడేళ్ల క్రితం ఫ్రెండ్స్‌ సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలమీదకు తెచ్చింది. గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు మురళీ క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. వెంటనే అతడిని తీసుకొని గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు విద్యార్థికి సీటీ స్కాన్‌ చేసి కడుపులో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. కడుపులోకి పెన్ను ఎలా వెళ్లిందా అని అందరూ షాకవుతుండగా మురళీ క్రిష్ణ అసలు విషయం చెప్పాడు. తాను తొమ్మిది తరగతి చదువుతుండగా స్నేహితులతో యాభై రూపాయలు పందెం కాశానని, పందెంలో భాగంగా తాను పెన్ను మింగినట్టు చెప్పాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారని భయంతో చెప్పలేదని తెలిపాడు. ఇప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చానని తెలిపాడు. ఈ క్రమంలో కడుపులోనుంచి పెన్ను తొలగించేందుకు వైద్య బృందం రెడీ అయింది. డాక్టర్ కవిత, నాగూర్ బాషా, శివరామక్రిష్ణ బృందం రెట్రో గ్రేడ్‌ ఎంటెరోస్కోపీ విత్‌ ఓవర్‌ ట్యూబ్‌తో శస్త్రచికిత్స లేకుండా పెన్నును తొలగించారు. వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే

వందేభారత్‌.. 180 కి.మీ స్పీడ్‌.. గ్లాస్‌ వణకలేదు..నీళ్ళు తొణకలేదు

LPG Gas Cylinder: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం.. డిసెంబరులో భారీ వసూళ్లు

అయ్యబాబోయ్‌.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్‌