ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్‌ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..

|

Dec 20, 2024 | 3:31 PM

ఇప్పుడు మీరు చూడబోయేది ఆన్లైన్ మోసాల్లో ఇది కొత్త రకం మోసం.. మీ బ్యాంకు వివరాలు.. ఓటిపి ఎవరు అడిగినా ఇవ్వొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్… ఓ సైబర్ నేరగాడి వలలో చిక్కి మోసపోయింది. అనంతపురం నగరంలో ఓ బ్యాంకు మేనేజర్ ను సైబర్ నేరగాడు బోల్తా కొట్టించాడు. బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్‌లో చెక్కు పంపించి… తాను ధ్వని హోండా షోరూం ఎండీని అని హాస్పిటల్లో ఉన్నానని.. అర్జెంటుగా చెక్కు క్లియర్ చేయాలని కోరాడు.

అయితే.. ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ నేరగాడా? లేక కస్టమరా? అని క్రాస్ చెక్ చేసుకోకుండానే బ్యాంకు మేనేజర్… తొమ్మిది లక్షల 50 వేల రూపాయల (9,50,000) నగదును సైబర్ నేరగాడి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కొత్త రకం సైబర్ మోసం.. బ్యాంకులకే సవాల్‌గా మారింది.. అంతేకాకుండా.. బ్యాంకింగ్ రంగంలోనే సంచలనంగా నిలిచింది. తమకు తెలియకుండా తొమ్మిది లక్షల 50 వేల రూపాయల నగదు వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అప్రమత్తమైన ధన్వి హోండా షోరూం నిర్వాహకులు బ్యాంకుకు వచ్చి.. బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది.. ఫోన్ చేసిన వ్యక్తి ధన్వి హోండా షోరూం ఎండి కాదని.. సైబర్ నేరగాడని తెలుసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సైబర్ నేరగాడు బ్యాంకు మేనేజర్ ను బోల్తా కొట్టించడానికి ముందే.. ధన్వి హోండా షోరూం నిర్వాహకులను బురిడీ కొట్టించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్‌ సేనలు

టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!

Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా ??