కదిలొచ్చే దహన వాటిక.. ఇంటి వద్దే అంత్యక్రియలు

|

Jan 31, 2023 | 9:38 AM

ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. లేదా పొలం ఉంటే అక్కడికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. కానీ కర్ణాటకలో వినూత్నంగా సంచార దహన వాటికను ప్రారంభించారు.

ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. లేదా పొలం ఉంటే అక్కడికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. కానీ కర్ణాటకలో వినూత్నంగా సంచార దహన వాటికను ప్రారంభించారు. ఇంటి వద్దే అంతిమ సంస్కారాలు నిర్వహించేలా ఓ పరికరాన్ని తయారు చేయగా.. అది అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లోని పలు గ్రామాల్లో సరైన రహదారులు లేవు, ఇక ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారీ వర్షాల సమయంలో మార్గం మొత్తం నీటిలో మునిగి ఉండటంతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సమయంలో తీర ప్రాంత జిల్లాలోని ఓ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పెరట్లోనే దహన సంస్కారాన్ని నిర్వహించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాత బాధ చూడలేని మనవడు.. చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్

Published on: Jan 31, 2023 09:38 AM