Lovely sisters: అక్క కోసం చెల్లెలు త్యాగం.. ఏం చేసిందంటే.. వైరల్ వీడియో.

|

Mar 01, 2023 | 7:46 PM

సాధారణంగా ఎవరికైనా కవల పిల్లలు పుట్టినప్పుడు వారిద్దరూ ఒకేలా కనిపించాలని వారికి ఆటబొమ్మల దగ్గర్నుంచి వేసుకునే బట్టలవరకూ అన్నీ ఒకేలా ఉండేవి కొంటుంటారు తల్లిదండ్రులు. అలా చిన్నప్పటినుంచి

సాధారణంగా ఎవరికైనా కవల పిల్లలు పుట్టినప్పుడు వారిద్దరూ ఒకేలా కనిపించాలని వారికి ఆటబొమ్మల దగ్గర్నుంచి వేసుకునే బట్టలవరకూ అన్నీ ఒకేలా ఉండేవి కొంటుంటారు తల్లిదండ్రులు. అలా చిన్నప్పటినుంచి ఒకటిగా పెరిగిన యానా, లూసీ అనే అక్కాచెల్లెలు జీవితాంతం ఒకేలా ఉండాలని భావించారు. అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండే ఆ ఇద్దరు అక్కచెల్లెలు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. అందుకే వారు ఎప్పటికే కలిసే ఉండాలని జీవితాన్ని కూడా ఒకే వ్యక్తితో పంచుకోవాలని భావించారు. ఈ క్రమంలో బెన్‌ అనే 37 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కథ మంచి రసకందాయంగా.. సంతోషంగా సాగుతోంది. ఈ క్రమంలో వారికి ఓ చిన్న సమస్య వచ్చింది. యానా దంతం ఇన్ఫెక్షన్‌కు గురయింది. దానిని తొలగించాల్సిందిగా వైద్యులు సూచించారు.చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఒకేలా కనిపించే తాము ఇక మీదట పళ్ల విషయంలో భిన్నంగా కనిపించబోతున్నామనే ఆలోచన ఆ కవలలను కలచివేసింది. ఇకపై వారిద్దరూ ఒకేలా ఉండలేమా అన్న ఆలోచనే జీర్ణించుకోలేకపోయింది లూసీ. వెంటనే ఓ నిర్ణయం తీసుకుంది. అక్కకు లేని దంతం తనకూ వద్దనుకుంది. అక్కతోపాటే తన దంతాన్ని కూడా తీయించుకోవాలని భావించింది. దీంతో యానాతో పాటు లూసీకి కూడా పంటిని తొలగించారు వైద్యులు. ఇక ఎప్పటికీ పళ్లతో సహా అన్నింటిలో ఒకేలా కనిపిస్తామని.. తమ భర్తతోనూ సంతోషంగా ఉంటామని ఆ అక్కాచెల్లెలు మురిసిపోయారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఫెర్త్‌లో జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..