వామ్మో.. అద్దె ఇంటికి రూ. 23 లక్షలు అడ్వాన్స్
ఓ ఇంటి యజమాని 4 బెడ్రూం ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ కు 23 లక్షల రూపాయల భారీ సెక్యూరిటీ డిపాజిట్‌ను డిమాండ్ చేయడంతో కెనడాకు చెందిన డిజిటల్ క్రియేటర్ కాలెబ్ ఫ్రీసెన్ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, మరోసారి నెట్టింట బెంగళూరులోని అద్దెలపై కొత్త చర్చ సాగుతోంది.
బెన్నిగనహళ్లిలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి ఫర్నిచర్ తో ఉన్న ఈ ఇంటికి నెలవారీ అద్దె రూ.2,30,000గా ఉంది. అయితే, ఈ సెక్యూరిటీ డిపాజిట్ 10 నెలల అద్దెకు సమానమని ఫ్రీసెన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అద్దె నిబంధనలను పోలుస్తూ న్యూయార్క్, టొరంటోలో ఒక నెల, శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు నెలలు, లండన్‌లో 5-6 వారాల డిపాజిట్ మాత్రమే సాధారణమని ఆయన అన్నారు. ఈ పోస్ట్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కొందరు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు బెంగళూరులోని ప్రీమియం ప్రాపర్టీలకు ఇటువంటి డిపాజిట్లు సాధారణమేనని అభిప్రాయపడ్డారు. నగరంలో అద్దెల కట్టడికి తగిన రూల్స్ లేకపోవటంతో ఇలా అందిన కాడికి దోచుకుంటున్నారని మరికొందరు ఆక్రోశం వ్యక్తం చేశారు. సాధారణంగా బెంగళూరులో 5-6 నెలల అద్దెను ముందస్తు డిపాజిట్‌ను యజమానులు డిమాండ్ చేస్తారని పలువురు అన్నారు. కొందరు ఇంటి యజమానుల అత్యాశను తప్పుబడుతుండగా, ఎంత అద్దె అయినా చెల్లించడానికి కొందరు రెడీ కావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, సినిమా టిక్కెట్‌ల మాదిరిగా అద్దె ఇళ్లమీదా రెంట్ కంట్రోల్ చట్టం తేవాలని ఒక నెటిజన్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?
మీరు జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
30 ఏళ్లకు వికసించిన కమలం మురిసిన కాశ్మీరం
స్విమ్మింగ్ పూల్ లో ఆఫీస్ డెస్కులు.. వినూత్న ఆలోచనకు ఉద్యోగులు ఫిదా..