దేవుడున్నాడు అనడానికి నిదర్శనం.. ఈ సీన్ !!

Updated on: May 02, 2025 | 5:49 PM

దొంగకు చోరీ చేయడమే టార్గెట్‌. అది గుడా, బడా అనేదానితో పనిలేదు. వచ్చామా.. దొరికింది ఎత్తుకెళ్లామా.. అన్నదే ఇంపార్టెంట్‌. అయితే ఓ దొంగ.. ఏకంగా దేవుడి హుండీనే కొల్లగొట్టాలని చూశాడు. కానీ తన ముందే తప్పు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా.. ఆ దొంగకు కరెక్ట్‌గా బుద్ది చెప్పాడు. రాత్రి వేళలో గుడిలో చోరీకి యత్నించిన దొంగ డబ్బుల కోసం హుండీలో చేయి పెట్టాడు.

అయితే దొంగ చేయి హుండీలో ఇరుక్కుపోయింది. ఏం చేసినా చేయి బయటకు రాలేదు. దీంతో తెల్లారేవరకు అలానే ఉండిపోయాడు. మరుసటి ఉదయం టెంపుల్‌కి వచ్చినవారికి ఈ దొంగ బాగోతం అర్థం అయింది. ముందుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ ఫైటర్స్ హుండీని కత్తిరించి దొంగ చేయి బయటకు తీశారు. అనంతరం దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా నల్లంపల్లి సమీపం చేసంపట్టి గ్రామంలోని పెరియాండిచ్చి ఆలయంలో ఏప్రిల్ 25న జరిగింది. నిందితుడు చేసంపట్టి సమీపం సవుళూర్‌ గ్రామానికి చెందిన తంగరాజ్‌ గా గుర్తించారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిజంగానే దేవుడున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేవుడి మహిమతోనే దొంగ చేయి హుండీలో ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామాన్యులకు చిక్కనంటున్న చింతచిగురు.. @1000/-

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్‌ 1 నుంచి పండగే..!

సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..

వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్‌ సూచన..!

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..