తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..

Updated on: Jul 06, 2026 | 4:34 PM

మహారాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ దాభాడేలో కొత్త నీటి సరఫరా పైప్‌లైన్ ట్రయల్ సందర్భంగా రహదారి ఒక్కసారిగా పగిలి భారీగా నీరు ఎగిసిపడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పైప్‌లైన్ అనుసంధానంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని అధికారులు గుర్తించారు. మరమ్మతుల ఖర్చు మొత్తం కాంట్రాక్టర్ నుంచే వసూలు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు.

తారురోడ్డును చీల్చుకుంటూ ఉవ్వెత్తున ఎగసిపడింది గంగమ్మ. మహారాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ దాభాడేలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దాదాపు ఏడాదిన్నర క్రితం తలేగావ్ దాభాడే మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నీటి సరఫరా పథకం కోసం రహదారి కింద కొత్త పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత ఆ రోడ్డుపై కొత్తగా తారు వేశారు. వచ్చే వారం ఈ వాటర్ సప్లై స్కీమ్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం కొత్త నీటి ట్యాంక్ నుంచి పైప్‌లైన్‌లోకి ట్రయల్ కోసం నీటిని విడుదల చేశారు. అయితే కొద్దిసేపటికే రహదారి మధ్యలో నుంచి ఒక్కసారిగా భారీ ఒత్తిడితో నీరు పైకి ఎగిసిపడింది. రోడ్డు పగిలిపోయిందని భావించిన ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పైప్‌లైన్ అమర్చే సమయంలో కాంట్రాక్టర్ రెండు పైపులను సరిగా అనుసంధానం చేయలేదని గుర్తించారు. దీంతో ట్రయల్ సమయంలో నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఆ ప్రాంతం నుంచి నీరు భారీగా బయటకు ఉబికి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తలేగావ్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్.. పైప్‌లైన్ మరమ్మతులు, రహదారి పునర్నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును సంబంధిత కాంట్రాక్టర్ నుంచే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనతో తలేగావ్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యత, కాంట్రాక్టర్ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..

Weather Update: తీరానికి దూసుకొస్తున్న వాయుగుండం! ముంబైని ముంచేసింది.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

Tirupati: లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Loading...
Unable to load recommendations.
Follow Us