వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
హైదరాబాద్‌లో వాహన చోరీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దొంగలు కొత్త పద్ధతులతో కేవలం కొన్ని సెకన్లలోనే వాహనాలను అపహరిస్తున్నారు. బాలాపూర్‌లోని ఓ యాక్టివా కేవలం 15 సెకన్లలో చోరీకి గురైన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు తమ వాహనాలను పార్క్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్నట్టే దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. చోరీల్లో తమకు తామే సాటి అనేలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో వాహన చోరీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కస్టమర్స్‌లా వెళ్లి జువెల్లరీ షాపుల్లో నగలు కొట్టేస్తున్నారు కొందరు. ఇక హోటల్స్, దుకాణాల ముందు పార్క్ చేసిన బైకులను షాపులోకి వెళ్లి వచ్చేలోపే లేపేస్తున్నారు. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కేవలం 15 నుంచి 20 సెకన్ల వ్యవధిలోనే ఓ ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైన ఘటన కలకలం రేపింది. ఈ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలే కొనుగోలు చేసిన ఆక్టివా వాహనాన్ని బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఓ షాప్ ముందు పార్క్ చేసి, మంచినీళ్ల బాటిల్ కొనడానికి వెళ్లాడు. అయితే అంతలోనే గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చి, క్షణాల్లో వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. షాప్ నుంచి బయటకు వచ్చేసరికి వాహనం కనిపించకపోవడంతో బాధితుడు అవాక్కయ్యాడు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. కేవలం కొన్ని సెకన్లలోనే చోరీ జరగడం పట్ల బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేది లేక బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పగలు పూట రద్దీ ప్రాంతాల్లోనే ఇలాంటి చోరీలు జరగడం స్థానికుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ప్రజలు వాహనాలను పార్క్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో
Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే