బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ?? ఇండియాలో వేగంగా పెరుగుతున్న DINK కల్చర్
మెట్రో నగరాల్లో పిల్లలను పెంచడం ఇప్పుడు కోట్ల రూపాయల వ్యవహారంగా మారుతోంది. చదువు, ఆరోగ్యం, లైఫ్‌స్టైల్ ఖర్చులు పెరుగుతుండటంతో చాలామంది యువ దంపతులు ‘డింక్’ అంటే డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ లైఫ్‌స్టైల్ వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లల పెంపకం ఖర్చులపై వచ్చిన తాజా విశ్లేషణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
భారత్‌లోని మెట్రో నగరాల్లో పిల్లలను పెంచడమనేది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఫైనాన్షియల్ అడ్వైజర్, కంటెంట్ క్రియేటర్ దీనిపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉదయన్ అధ్వే తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో… ఒక చిన్నారిని పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచడానికి అయ్యే ఖర్చులను వివరంగా లెక్కేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం, విద్యారంగంలో ద్రవ్యోల్బణం ఏడాదికి 10-12 శాతం వరకు పెరుగుతోంది. అంటే ప్రతి 6 ఏళ్లకూ చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు, నేడు ఒక కాలేజీ కోర్సు రూ. 20 లక్షలు ఉంటే, ఆ చిన్నారికి 18 ఏళ్లు వచ్చేసరికి అది రూ. 1.6 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు. కేవలం స్కూల్, కాలేజీ ఫీజులే కాకుండా.. స్పోర్ట్స్, మ్యూజిక్ క్లాసులు, కోచింగ్ సెంటర్లు, ల్యాప్‌టాప్, ఫోన్, వెకేషన్లు, ఆరోగ్య ఖర్చులు, లైఫ్ స్టైల్ ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తం రూ. 6.75 కోట్లకు చేరుకుంటుందని అన్నారు. సాధారణ ‘చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు’ ఇచ్చే 5-6 శాతం రాబడి ఈ ఖర్చులను తట్టుకోవడానికి సరిపోదని, తల్లిదండ్రులు మరింత లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు “ఇలాంటి వీడియోలు భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి” అని అభిప్రాయపడగా, మరికొందరు జోక్ చేస్తూ “అంత డబ్బుతో ఒక లంబోర్ఘిని కారు కొనుక్కోవచ్చు” అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, మారుతున్న కాలంలో పిల్లల పెంపకం అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా మారిందన్నది కాదనలేని నిజం. పూర్వం… అంటే తాతలనాటి కాలంలో పిల్లలు ఎంతమంది అంటే 8 లేదా 9 అంతకు మించి అనే సంఖ్య వినిపించేది. తర్వాత కుటుంబ నియంత్రణ, జనాభా రేటు అంటూ ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు వద్దు అనేవారు. అనంతరం అది ఒకరికి పడిపోయింది. ఇద్దరి కంటే ఒకరే బెస్ట్ అనుకున్నారు. తరువాత ఏకంగా పిల్లలే వద్దని అనుకున్నారు. దీన్నే డింక్ కల్చర్‌గా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదో ట్రెండ్‌గానూ మారింది. పాశ్చాత్య దేశాల్లోని ఈ విధానం క్రమంగా ఇండియాకూ పాకింది. డింక్ కల్చర్‌కు అట్రాక్ట్ అవుతున్న భార్యభర్తలు పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదు. కానీ ప్రభుత్వం ఏమో పిల్లల్ని కనమంటోంది. డబుల్ ఇన్‌కం నో కిడ్స్‌ను షార్ట్ ఫాంలో డింక్ అని పిలుస్తారు. గత ఐదారేళ్లుగా సోషల్ మీడియాలో ఇలాంటివాళ్లు తమ లైఫ్ స్టైల్ గురించి పోస్ట్‌లు పెడుతుండడంతో డింక్‌కి బాగా పబ్లిసిటీ పెరిగింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డింక్ కల్చర్ ను ఫాలో అయ్యే వాళ్లలో చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడం కోసమే పిల్లల్ని ఇష్టపడడం లేదని చెప్పారు. పిల్లలు ఉంటే వాళ్ల ఆరోగ్యం, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగడం లేదు. అందువల్ల పిల్లలు తలకు మించిన భారం అనుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ రూల్ వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజం దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు. భారతదేశంలో పిల్లలు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. పిల్లల ఉనికిని కలిగి ఉండటం తల్లిదండ్రులకు మాత్రమే కాదు. అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. రానురాను DINK లైఫ్‌స్టైల్ భారతదేశంలో ఎలా ఉంటుందో చూడాలని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్ నిబంధన
ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ
పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన
మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ