మహాశివుని పాదాలను తాకిన గంగమ్మ కనువిందు చేస్తున్న దృశ్యాలు

Updated on: Aug 09, 2025 | 2:48 PM

ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గంగమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదలు రావడంతో గంగానది ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది.. ఈ సమయంలో ఒక వింత దృశ్యం కనిపించింది. రిషికేశ్ మధ్యలో ఉన్న శివుని విగ్రహాన్ని తాకుతూ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ గంగమ్మ తల్లి స్వయంగా ఆ మహాదేవుడి పాదాలను కడుగుతున్నట్లుగా ఉంది.

రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్‌ ఆశ్రమం వద్ద గంగమ్మ శివుని విగ్రహాన్ని తాకుతోంది. ఇది జూన్ 2013 విపత్తు దృశ్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం మంగళవారం కూడా పూర్తిగా ఆగలేదు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం, గంగా నది నీటి మట్టం హెచ్చరిక రేఖకు దగ్గరగా చేరుకుంది. వర్షానికి నదులు కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వరకు దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. రిషికేశ్‌లో గంగా నది 340.50 RL మీటర్ ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ఈ ప్రాంతంలోని కాలానుగుణ నదులు, వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. స్నాన ఘాట్‌కు వెళ్లడాన్ని నిలివేశారు. పోలీసులు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో

పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో